telangana

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో

webdesk | Saturday, May 27, 2017 8:37 PM IST

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో

గెస్ట్ ఫ్యాకల్టీలు


హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లోని స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి 
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని పోస్టు గ్రాడ్యుయేట్‌లోని టీచింగ్ అండ్ రిసెర్చ్ రంగంలో మెళకువలను అందించడానికి ప్రాథమిక విద్యా సంస్థగా 1974 అక్టోబర్ 2న ఏర్పాటు చేశారు.
మొత్తం ఖాళీల సంఖ్య: 8 పోస్టులు (జనరల్-4, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-1)
విభాగాలు: అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, కొరియన్, రష్యన్, స్పానిష్
విద్యార్హతలు: 
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ (ఎంఏ- ఫారెన్ లాంగ్వేజ్)లో ఉత్తీర్ణత. యూజీసీ నెట్ ఉత్తీర్ణత ఉండాలి.
పే స్కేల్: రూ. 25,000/-
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ లేదా ఈ-మెయిల్ ([email protected]) ద్వారా. 
దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 2
వెబ్‌సైట్:www.uohyd.ac.in


కన్సల్టెంట్ పోస్టులు
హైదరాబాద్ యూనివర్సిటీలో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ. కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలోనిది.
కన్సల్టెంట్ ఇన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ - 5
అర్హతలు: బీకాంలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. లేదా సెకండ్ క్లాస్‌లో ఎంకాం లేదా ఎంబీఏ ఫైనాన్స్ ఉత్తీర్ణతతోపాటు డిగ్రీస్థాయిలో బీకాం చదివి ఉండాలి. అనుభవం ఉండాలి.
కన్సల్టెంట్ ఇన్ ఇంటర్నల్ ఆడిట్ - 1
అర్హత: ఏదైనా డిగ్రీలో ఎస్‌ఏఎస్ గ్రేడ్‌లో ఉత్తీర్ణత
కన్సల్టెంట్ ఇన్ ఇంజినీరింగ్ అకౌంట్ - 1
అర్హత: ఇండియన్ ఆడిట్ ఆఫీసర్స్‌గా పనిచేసినవారు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: నిర్ణీత నమనాలో
చివరితేదీ: జూన్ 10
వెబ్‌సైట్: http://www.uohyd.ac.in