telangana

బ్యూటీపార్లర్‌లో ఉచిత శిక్షణ

Webdesk | Thursday, February 1, 2018 10:43 AM IST

 హైదరాబాద్ : వెనుకబడిన తరగతుల ఉద్యోగ, నై పుణ్య అభివృద్ధి, శిక్షణా కేంద్రం(స్టడీ సర్కిల్) ఆధ్వర్యంలో బ్యూటీపార్లర్ మేనేజ్ మెం ట్‌లో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి ఎంబీకే మంజుల ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీ ఆపై అర్హతలు కలిగి 19-35 ఏండ్ల మధ్య వయసు ఉన్న వారు మాత్రమే అర్హులు. ఆసక్తిగల వారు ఫిబ్రవరి 10లోగా సైదా బాద్ లక్ష్మీనగర్ రోడ్‌నెంబర్ 8లోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌లో సంప్రదించి రిజిష్టర్ చేసుకోవాలని సూచించారు.