students

ఉచిత ఉపాధి శిక్షణ తరగతులు

Webdesk | Saturday, March 10, 2018 9:10 AM IST

 హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లోని బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ (బైరెడ్)లో నిరుద్యోగ యువకులకు 6 వారాల ఉచిత ఉపాధి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ యేసేపు ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి మే 18వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉచిత ఉపాధి శిక్షణ తరగతుల్లో చేరేందుకు ఆసక్తి కలిగిన వారు ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో (www.bired.org వెబ్‌సైట్)లో దరఖాస్తూలను చేసుకోవాలని సూచించారు. 


ఇందుకో సం 19 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. అడ్మిషన్లు పొందిన అభ్యర్థులు ఏప్రిల్ మూడు ఉదయం 9 గంటలలోపు రాజేంద్రనగర్‌లోని బైరెడ్ సంస్థ కార్యాలయంలో విద్యార్హతల ఒరిజినల్, రెండు సెట్ల జీరాక్స్, ఆధార్, ఆహార భద్రత కార్డు, 5 కలర్ పాస్‌పోర్టుసైజు పోటోలతో హాజరు కావాలని సూచించారు. 

ఈ శిక్షణ లో పదవ తరగతి పాస్, పెయిల్ అయిన వారికి మొబై ల్ సర్వీసింగ్, ఎలక్ట్రీషియన్, వ్యవసాయ పంప్‌సెట్ రీపెర్, ఇంటర్ ఆపైన చదివిన వారికి యంఎస్‌ఆఫీస్, పిసి.హార్డ్‌వేర్, ల్యాప్‌టాప్ సర్వీసింగ్‌లలో శిక్షణ ఉం టుందన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం, శిక్షణ పూర్తి అనంతరం అభ్యర్థులకు రాను,పోను చార్జీ లు ఇవ్వటం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు www.bired.org లో సంప్రదించాలన్నారు.