students

ఉచిత కంప్యూటర్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Webdesk | Monday, July 31, 2017 10:29 AM IST

ఉచిత కంప్యూటర్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

 చిక్కడపల్లి : న్యూ కర్సర్ ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తేదీ నుంచి ఉచిత కంప్యూటర్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ అడ్మిన్ మేనేజర్ , ప్రిన్సిపాల్ పీ.ఎన్.మూర్తి తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రలోని న్యూ కర్సర్ కార్యాలయంలో ఆయన మాట్లాడు తూ ఎంఎస్ ఆఫీస్, ట్యాలీ, ఫోటో షాప్, ఇంగ్లీ ష్, తెలుగు టైపింగ్ తదితరు కోర్సులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 10వ తరగతి చదువుకున్న నిరుద్యోగులు, సీనియర్ సిటజన్స్ ,మహిళలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరా ల కోసం 94948 64040, 94948 63030 లలో సంప్రదించాలని సూచించారు.