students

టీఎస్ సెట్ ఫీజు గడువు పొడిగింపు       

webdesk | Tuesday, March 21, 2017 11:42 AM IST

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఎలిజబిలిటీ టెస్టు(టీఎస్‌సెట్) పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు సెట్ మెంబర సెక్రటరీ ప్రొఫెసర్ యాదగిరిస్వామి ప్రకటించారు. ఈ నెల 20తో సెట్ దరఖాస్తు ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఈ నెల 27 వరకు పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. సెట్‌కు అర్హులయ్యే అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు అధికారులు. ఇతర వివరాల కోసం TELANGANASET.ORG వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.