students

నీట్‌పై ఉచిత అవగాహాన సదస్సు

Webdesk | Friday, March 16, 2018 10:25 AM IST

 హైదరాబాద్ : 2018 మేలో జరిగే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఈ నెల 17న ఉదయం 10గంటలకు బాగ్ లింగంపల్లిలోని సందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉచిత అవగాహాన సదస్సు నిర్వహిస్తున్నట్లు 21 సెంచరీ ఎడ్యూకేషనల్ సోసైటి చైర్మన్ పి.కృష్ణప్రదీప్, మాజీ డీఎంఈ పుట్టా శ్రీనివాస్‌లు తెలిపారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో 21 సెంచరీ ఎడ్యూకేషనల్ ఆధ్వర్యంలో విలేకర్ల సమాశం నిర్వహించారు. 


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వైద్య విద్యలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసే ఉద్ధేశ్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేయమైనదని అన్నారు. నీట్ ఎగ్జాంలో వస్తున్న మార్పులు, సిలబస్, ఏయే అంశాలపై పట్టు సాధిస్తే నీట్ ఎగ్జాంలో విజయం సాధించవచ్చు అనే అంశాలపై అవగాహన ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు, ఈ సదస్సుకు హాజరై నీట్ పరీక్షపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకొని, సూచనలను పొందగలరని పేర్కొన్నారు. ఈ సందస్సుకు హాజరై ఉచిత బుక్‌లెట్,మాదిరి ప్రశ్నపత్రాలు పొందగలరు. వివరాలకు 9948839137, 040-48543136 నెంబర్లకు సంప్రదించగలరు.