students

నీట్, ఎంసెట్‌లో ఉచిత కోచింగ్

Webdesk | Monday, March 19, 2018 10:56 AM IST

  మెహిదీపట్నం: ఎంసెట్, నీట్ 2018 రాసే విద్యార్థినిలకు ఉచిత కోచింగ్ ఇస్తున్నామని ఇక్రా ఎడ్యుకేషన్ సొసైటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఇక్రా సొసైటీ ప్రతినిధి మహ్మద్ హనీఫ్ ఉచిత కోచింగ్ వివరాలను తెలిపారు. ఈ నెల 19 వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే ఈ కోచింగ్ నీట్,ఎంసెట్ పరీక్షలు ముగిసే వరకు ఉంటుందన్నారు. టోలిచౌకిలోని మహబూబ్ కాంప్లెక్స్‌లో గల జీకే అకాడమీలో అదే విధంగా పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెం200 వద్దగల రిలయన్స్ డిగ్రీ కాలేజీలో ఈ ఉచిత కోచింగ్ ఉంటుందని అన్నారు. ఆసక్తి గల విద్యార్థులు 9700685965, 040-23562025, రిలయన్స్ కాలేజీ లో 9000622342, 9885238353 నెంబర్లలో సంప్ర దించాలని సొసైటీ ప్రతినిధి హనీఫ్ సూచించారు.