students

మేడ్చల్ జిల్లాలో కౌశల్‌ ఉద్యోగ మేళా

Webdesk | Friday, March 23, 2018 12:41 PM IST

మేడ్చల్ జిల్లాలో కౌశల్‌ ఉద్యోగ మేళా

 మేడ్చల్ : జిల్లాలో యువతీ, యువకులకు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకంలో భాగంగా నేడు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా అల్వాల్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వై.నిర్మల తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు స్థానికంగా ఉన్న ప్రొవైడర్స్ ద్వారా శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని అన్నారు. 

శిక్షణ కాలంలో మహిళలు, వికలాంగులకు నెలకు రూ.1000 ైస్టెఫండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ పూర్తి అయిన అనంతరం పురుషులకు ఒక నెలకు రూ.1500, మహిళలకు రెండు నెలల పాటు అదే రూ.1500 చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ విజవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ద్వారా ధ్రువపత్రం అందించి, ముద్ర పథకం ద్వారా బ్యాంకు రుణాన్ని మంజూరు చేయించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యా ధ్రువీకరణ పత్రం, పాస్‌ఫొటోలు, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ ప్రతులను దరఖాస్తు పత్రంతో జతపరిచి ఉపాధి కల్పన కార్యాలయంలో అందించాలని సూచించారు.