students

నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ

webdesk | Friday, November 3, 2017 10:21 AM IST

 హైదరాబాద్ : నల్లకుంట ఫీవర్ దవాఖాన చౌరస్తాలోని బెత్లెహమ్ కళాశాలలో 45 రోజుల నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మ్యాన్సీ తెలిపారు. పదో తరగతి పాస్/ఫెయిల్ అయి ఉండి 18 నుంచి 29 సంవత్సరాలలోపు వయసు గల వారు ఈ కోర్సుకు అర్హులని చెప్పారు. ఈ శిక్షణలో అడ్మిషన్ తీసుకున్న వారికి ఉచితంగా పుస్తకాలు, యూనిఫారం, బస్‌పాస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఈ ట్రైనింగ్‌తో పాటు కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్‌లలో కూడా శిక్షణ ఇస్తామని తెలిపారు. కచ్చితంగా ఉద్యోగం చేస్తామనే వారే ఈ కోర్సులో చేరాలని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కార్పొరేట్ దవాఖానల్లో నెలకు రూ.9వేల నుంచి రూ.12వేల జీతం ఇప్పిస్తామన్నారు. ఆసక్తి గలవారు 9908098903, 9989182132 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.