students

నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ

Webdesk | Wednesday, February 7, 2018 11:54 AM IST

నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ

  సుల్తాన్‌బజార్ : ఈగల్ వింగ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో 2 నెలలు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ ఎడ్విన్ తెలిపారు. పదో తరగతి పాస్/ఫెయిల్ అయి ఉండి 18 నుంచి 29ఏళ్ల లోపు వయస్సు గల వారు ఈ కోర్సులో చేరడానికి అర్హులని చెప్పారు. శిక్షణ సమయంలో యూనిఫాం, బుక్స్‌తోపాటు కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిషులోఉచితంగా శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. శిక్షణ పూర్తైన వారికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో నెలకు రూ.9వేల నుంచి రూ.12వేల జీతంతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికెట్ ఇస్తామని తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉందని ఆయన వివరించారు. బాలబాలికలకు ఉచిత హాస్టల్ వసతి కూడా ఉందని, ఆసక్తి గలవారు సెల్: 8341306736, 7995072897 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.