students

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Webdesk | Wednesday, January 24, 2018 9:36 AM IST

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

  మేడ్చల్ : 2018-19 ఏడాదికి సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామాంతపూర్, బేగంపేట)లలో ఒకటవ తరగతిలో ప్రవేశాలకు ఎస్సీ బాల, బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి మహ్మద్ యూసుఫ్‌అలీ ఓ ప్రకటనలో తెలిపారు. సదరు అభ్యర్థులు 2012, జూన్ 1వ తేదీ నుంచి 31 మే 2013 మధ్య కాలంలో జన్మించి ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలని ప్రకటనలో సూచించారు. 


ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత ధ్రువ పత్రాలతో ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించుకోవాలని అన్నారు. ప్రవేశాలకు సంబంధించి జిల్లా వాసులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా దరఖాస్తు చేసుకున్న బాలబాలికలకు ఉపకార వేతనాలు అందజేయబడతాయని సూచించారు.