students

గురుకులంలో ఇంటర్ ప్రవేశాలు

Webdesk | Monday, December 25, 2017 10:33 AM IST

గురుకులంలో ఇంటర్ ప్రవేశాలు

 తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలోని టీఎస్ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది.

 

వివరాలు:తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ పరిధిలోని తెలంగాణ గురుకులం పేరిట ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ -4, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ - 2, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ - 1 కాలేజీలను నిర్వహిస్తున్నది. వీటిలో ఇంటర్‌తోపాటు ఐఐటీ స్టడీ సెంటర్స్‌ను కూడా నిర్వహిస్తుంది. 
-అర్హతలు: రాష్ర్టానికి చెందిన ఎస్టీ (బాలురు, బాలికలు) విద్యార్థులు. 2018, మార్చిలో పదోతరగతి పరీక్షలు రాయబోతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, జెడ్‌పీహెచ్‌ఎస్, టీఎస్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతుండాలి. పదోతరగతి పరీక్షల్లో కనీసం బీ 2 గ్రేడ్ (7 పాయింట్లు)తో ఉత్తీర్ణులు కావాలి.
-తెలుగు/ ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు
-2018 -19 ఆర్థిక సంవత్సరానికి తల్లిదండ్రుల ఆదాయం పట్ణణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 1.5 లక్షలు మించరాదు. 
-ఎంపికైన విద్యార్థులు కుల, ఆదాయ, ఆధార్ కార్డు, మార్కుల మెమో, టీసీ, ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఆరు పాస్‌పోర్టు సైజ్ ఫొ టోలను ప్రవేశ సమయంలో దరఖాస్తుకు జతచేయాల్సి ఉంటుంది.
-ఈ కాలేజీల్లో 100 శాతం సీట్లను ఎస్టీ విద్యార్థులకు కేటాయించారు. వీటిలో 3 శాతం పీహెచ్‌సీ విద్యార్థులకు కేటాయిస్తారు.
 

ఎంపిక విధానం:

-రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో అర్హత సాధించినవారికి రెండో దశకు ఎంపిక చేస్తారు. ఇది డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఎంపీసీ/బైపీసీ వారికి సంబంధిత సబ్జెక్టులు, ఇంగ్లిష్‌పై పరీక్ష నిర్వహిస్తారు.
-మొదటి లెవల్ స్క్రీనింగ్ టెస్ట్ : 2018, ఫిబ్రవరి 4
-ఎంపీసీ పరీక్ష విధానం: ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ నుంచి 40 ప్రశ్నల చొప్పున ఇస్తారు. మొత్తం 160 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
-బైపీసీ పరీక్ష విధానం: ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి 40 ప్రశ్నల చొప్పున ఇస్తారు. మొత్తం 160 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
-పరీక్షలో 8- 10వ తరగతి సిలబస్‌పై ప్రశ్నలు ఇస్తారు.
-పరీక్ష కేంద్రాలు: ఉట్నూరు, ఆసిఫాబాద్, కాటారం (జయశంకర్ భూపాలపల్లి), ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల), గాంధారి (కామారెడ్డి), బాలానగర్ (మహబూబ్‌నగర్), మన్ననూరు (నాగర్‌కర్నూల్), నర్సాపూర్ (మెదక్), మొయినాబాద్ (హైదరాబాద్), అవంతిపురం (మిర్యాలగూడ), సూర్యాపేట, లక్ష్మీపూర్ (వరంగల్ అర్బన్), ఏటూరునాగారం, మహబూబాబాద్, భద్రాచలం, ఇల్లెందు, అమ్మపాలెం (ఖమ్మం).
-వివరాలు: ఇంటర్‌లో రెండో భాషగా తెలుగు మాత్రమే ఉంటుంది. బోధన ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. కాలేజీల్లో చేరిన విద్యార్థులకు వసతి, దుస్తులు, పుస్తకాలు, వైద్యం, పరీక్ష ఫీజులు అన్నీ సొసైటీ భరిస్తుంది. అంటే అన్నీ ఉచితంగా ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
-ఫీజు: ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు.
-చివరితేదీ: 2018, జనవరి 12
-వెబ్‌సైట్: www.tgtwgurukulam.telangana.gov.in