students

సెంట్రల్ రైల్వేలో 2196 ఖాళీలు

webdesk | Monday, November 6, 2017 12:06 PM IST

 సెంట్రల్ రైల్వే (ముంబై) పరిధిలోని-రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) వివిధ క్లస్టర్/డివిజన్ పరిధిలో అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


వివరాలు:సెంట్రల్ రైల్వేలో 1961 అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం శిక్షణ ఇస్తారు. ఈ అప్రెంటిస్ శిక్షణ సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై, భుసావల్, పుణె, నాగ్‌పూర్, షోలాపూర్ 
యూనిట్లలో చేయవచ్చు. 

-మొత్తం ఖాళీల సంఖ్య - 2196 వీటిలో ట్రేడుల వారీగా ఖాళీలు...
-ముంబై క్లస్టర్-1503 ఖాళీలు (క్యారేజ్ అండ్ వ్యాగన్ కోచింగ్, వాడీ బందర్-ముంబై-252, కళ్యాణ్ డీజిల్ షెడ్-50, కుర్ల డీజిల్ షెడ్-56, Sr.Dee (టీఆర్‌ఎస్) కళ్యాణ్ -179, Sr.Dee (టీఆర్‌ఎస్) కుర్లా-192, పరేల్ వర్క్‌షాప్-274, మాతుంగా వర్క్‌షాప్-446, ఎస్ అండ్ టీ వర్క్‌షాప్, బైకుల్లా-540.
-భుసావల్ క్లస్టర్-341 ఖాళీలు (క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో-81, ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్-68, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్ భుసావల్ -96, మన్మాడ్ వర్క్‌షాప్-48, టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్-48)
-పుణె క్లస్టర్-151 ఖాళీలు (క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో-30, డీజిల్ లోకో షెడ్-121)
-నాగ్‌పూర్ క్లస్టర్-107 ఖాళీలు (ఎలక్ట్రిక్ లోకో షెడ్, అజ్ని-48, క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో-59) 
-షోలాపూర్ క్లస్టర్-94 ఖాళీలు (క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో-73, కుర్దువాడి వర్క్‌షాప్-21, )
-ట్రేడ్ విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (పాసా), మెకానిక్ డీజిల్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, టర్నర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, షీట్ మెటల్ వర్కర్, విండర్ (ఆర్మేచర్), మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, టూల్ అండ్ డై మేకర్, మెకానిక్ మోటార్ వెహికిల్, మెకానిక్ డీజిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్.

-వయస్సు: 2017, నవంబర్ 1 నాటికి 15 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతిలో ఉత్తీర్ణత. ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ నుంచి సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 
-శిక్షణా కాలం: కార్పెంటర్, మెకానికల్ (డీజిల్), షీట్ మెటల్ వర్కర్ ట్రేడులకు రెండేండ్లు, మిగిలిన ట్రేడ్స్‌కు ఏడాది శిక్షణ కాలం.
-ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక విధానం: పదోతరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా (50:50) ఎంపికచేస్తారు.
-శారీరక ప్రమాణాలు: 1961 అప్రెంటిస్ యాక్ట్, 1992 యాక్ట్ ప్రకారం నిర్దేశిత ప్రమాణాలు కలిగి ఉండాలి.
-స్టయిఫండ్: సెంట్రల్ అప్రెంటిస్‌షిప్ కౌన్సిల్ నిర్ణయించిన విధంగా స్టయిఫండ్ చెల్లిస్తారు.

-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.

-చివరితేదీ: నవంబర్ 30

-వెబ్‌సైట్: www.rrccr.com.