students

సీసీఆర్‌టీలో 650 స్కాలర్‌షిప్స్

Webdesk | Tuesday, January 9, 2018 11:14 AM IST

 సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రెయినింగ్ (సీసీఆర్‌టీ) 2018-19 అకడమిక్ ఇయర్‌కు గాను వివిధ సాంస్కృతిక విభాగాల్లో యంగ్ చిల్డ్రన్ ఫెలోషిప్స్ పొందడానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

 

వివరాలు:భారత ప్రభుత్వ సాంస్కృతిక విభాగం పరిధిలో పనిచేస్తుంది.
-మొత్తం ఫెలోషిప్‌ల సంఖ్య: 650
-ప్రతి ఏడాదికి 650 యంగ్ చిల్డ్రన్ ఫెలోషిప్స్ ఇస్తారు. 
-విభాగాలు : సంగీతం, నృత్యం, నాటకం, పెయింటింగ్, శిల్పకళ, కళలు, సాహిత్య సాంస్కృతిక రంగాలు. 
-అర్హత: గుర్తింపు పొందిన పాఠశాలలో 10 నుంచి 14 ఏండ్ల వయస్సులో ఉన్న ప్రతిభావంతులైన పిల్లలు. 
-స్టయిఫండ్: ఏడాదికి రూ. 3600/-, సంస్థకు లేదా గురు/ఉపాధ్యాయుడికి ప్రత్యేక శిక్షణ కోసం ట్యూషన్ ఫీజు కింద రూ.9000/- చెల్లిస్తారు.
-ఈ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ రెండేండ్లకు ఇస్తారు. తర్వాత పునరుద్ధరించబడుతుంది.
-ఎంపిక: టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా. 
-ఇంటర్వ్యూ/టెస్ట్ తేదీలు, సమయాలు, వేదిక/ప్రదేశం విషయాలను పోస్టు ద్వారా తెలియజేస్తారు. 2018 మేలో ప్రాంతీయ స్థాయిలో నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: CCRT Regional Centre, OPP. CII , New Google Office, Kondapur Main Road, Madhapur, Hyderabad-500084
-చివరితేది: జనవరి 31
-వెబ్‌సైట్: www.ccrtindia.gov.in