students

10 నుంచి ఉచిత కంప్యూటర్ శిక్షణ

webdesk | Wednesday, November 8, 2017 10:31 AM IST

  హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని న్యూకర్సర్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు సంస్థ అడ్మిన్ మేనేజర్ పీఎన్ మూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ స్థాపించినప్పుటి నుంచి 2500 మందికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారికి బేసిక్ కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులకు డేటాఎంట్రీ, హార్డ్‌వేర్ తదితర కోర్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి నెల 10వ తేదీ నుంచి ఉచిత కంప్యూటర్ క్లాసులకు వచ్చే విద్యార్థులకు తమ పేర్లను దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. వివరాల కోసం 9494867070కి సంప్రదించాలని సూచించారు.