online-courses

దుర్గాబాయ్‌లో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Webdesk | Tuesday, March 6, 2018 11:05 AM IST

దుర్గాబాయ్‌లో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

  హైదరాబాద్ : ఓయూ క్యాంపస్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ మహిళా సభ లిటరసీహౌజ్‌లో పలు కోర్సులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, ట్యాలీ ఈఆర్‌పీ 9, టైలరింగ్, మగ్గంవర్క్, బ్యూటీషియన్ తదితర కోర్సుల్లో సర్టిఫికెట్ కోర్సులకు ఈ నెల 8వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు చెప్పారు. ఈ కోర్సులు విద్యార్థులు, నిరుద్యోగులు ప్రత్యేకించి మహిళలకు ఎంతో ఉపయోగమని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9951210441, 040-27098406 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.