notifications

యూపీఎస్సీ సివిల్స్-2017

webdesk | Wednesday, March 1, 2017 8:34 PM IST

సివిల్స్ ఎగ్జామ్ ద్వారా భర్తీచేసే పోస్టులు:మొత్తం 24 రకాల అఖిల భారత సర్వీసులు ఉన్నాయి.ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్), ఇండియన్ పీ అండ్ టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐటీ), ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, పోస్ట్ ఆఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, ఆర్మ్‌డ్ ఫోర్సెసెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీసెస్ (గ్రేడ్ బీ), ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవులు, డామన్, డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ సివిల్ సర్వీస్ (గ్రేడ్ బీ), ఢిల్లీ అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవులు, డామన్, డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ పోలీస్ సర్వీస్ (గ్రేడ్ బీ), పాండిచ్చేరి సివిల్ సర్వీస్ (గ్రేడ్ బీ), ఢిల్లీ అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవులు, డామన్, డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ సివిల్ సర్వీస్ (గ్రేడ్ బీ).
పోస్టుల సంఖ్య- 980. వీటిలో 27 ఖాళీలు పీహెచ్‌సీ కేటగిరీకి కేటాయించారు. 7 ఎల్‌డీసీపీ, 8 బీ/ఎల్‌వీ, 12 హెచ్‌ఐ కేటగిరీకి కేటాయించారు.

అర్హులు:భారతీయులై ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ డిగ్రీ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మెయిన్స్ ఎగ్జామ్ జరిగేనాటికి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 2017, ఆగస్టు 1 నాటికి 21-32 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జనరల్ అభ్యర్థులు ఆరుసార్లు, ఓబీసీలు తొమ్మిదిసార్లు, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు.
నోట్: 24 రకాల సర్వీసెస్‌లలో కొన్నింటికి శారీరక ప్రమాణాలు అవసరం. వివరాలు నోటిఫికేషన్‌లో చూడవచ్చు.

పరీక్ష విధానం: 
మొదటి దశ: సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో అర్హత సాధించినవారిని రెండోదశకు ఎంపికచేస్తారు.
రెండో దశ: సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్. దీనిలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. 
నోట్: ప్రస్తుత నోటిఫికేషన్ ప్రిలిమ్స్‌కు సంబంధించింది.
 

ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు 
పేపర్-1: 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 2 గంటలు
పేపర్- 2: 200 మార్కులు. కాలవ్యవధి 2 గంటలు.
గమనిక: పేపర్-2 కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. కనీసం 33 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. 
పేపర్- 1, 2లు ఆబ్జెక్టివ్ (మల్టిపుల్ చాయిస్) విధానంలో ఉంటాయి. 

 

పరీక్ష కేంద్రాలు: 
హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మార్చి 17
ఫీజు: రూ. 100/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు)
వెబ్‌సైట్: HTTPS://UPSCONLINE.NIC.IN