notifications

ఉపాధికల్పన శాఖలో రేపు మినీ జాబ్ మేళా

Webdesk | Friday, February 23, 2018 9:31 AM IST

  హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో రేపు నిరుద్యోగ యువతకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి ఎన్.మైత్రిప్రియ తెలిపారు. ఈ జాబ్ మేళాకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ చదివిన ఆసక్తి గల అభ్యర్థులు హాజరుకావాలని తెలిపారు. అభ్యర్థులు తమ అర్హత, ఆధార్, తదితర సర్టిఫికెట్లన్ని జిరాక్స్ కాఫీలతోపాటు పాసు ఫొటోలు తీసుకొని రావాలని తెలిపారు. ఈ జాబ్ మేళాలో యాక్ట్ ఫైబర్‌నెట్, స్వీగ్గి, ఫ్లీప్‌కార్ట్, మన్న ట్రస్ట్, సృత గృహా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పాల్గొననున్నాయని వివరించారు. ఈ సంస్థల్లో సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, డెలివరీ ఎగ్జిక్యూటివ్ తదితర హోదాల్లో సుమారు 200 ఖాళీలున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నెల వేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వీరందరికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనా పథకం ద్వారా ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ శాంతినగర్, ప్రభుత్వ ఐటీఐ ముషీరాబాద్ ప్రాంతాల్లో వెబ్ డెవలపర్, డాటా ఎంట్రీ ఆపరేటర్‌కు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. వివరాలకు రఘుపతి: 8247656356 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.