notifications

యునానిలో ఎస్‌ఆర్‌ఎఫ్‌...పోస్టుల భర్తీ

Webdesk | Tuesday, December 19, 2017 10:08 AM IST

యునానిలో ఎస్‌ఆర్‌ఎఫ్‌...పోస్టుల భర్తీ

 హైదరాబాద్‌లోని సెంట్రల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ (సీఆర్‌ఐయూఎం) ఖాళీగా ఉన్న ఎస్‌ఆర్‌ఎఫ్, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


వివరాలు: 
-పోస్టు పేరు: రిసెర్చ్ అసోసియేట్-2 ఖాళీలు
-అర్హత: యునానిలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత. సీసీఐఎం/ఆయూష్‌లో సభ్యత్వం నమోదు చేసుకోవాలి. 
-40 ఏండ్లకు మించరాదు
-పే స్కేల్: రూ. 36,000/- అదనంగా హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.
-పోస్టు పేరు: సీనియర్ రిసెర్చ్ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్)-3 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ/బాటనీలో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష, బీయూఎంఎస్ లేదా యునానీ మెడిసిన్‌లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 28,000/- అదనంగా హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.
-ఎంపిక: ఇంటర్వ్యూ
-దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, ఇంటర్వ్యూ తేదీన పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
-ఇంటర్వ్యూ తేదీ: రిసెర్చ్ అసోసియేట్ పోస్టు లకు 2017, డిసెంబర్ 21, ఎస్‌ఆర్‌ఎఫ్‌కు 2018 జనవరి 11
-వెబ్‌సైట్: www.criumhyderabad.net