notifications

ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ

Webdesk | Thursday, November 30, 2017 12:18 PM IST

  హైదరాబాద్ : మహానగరంలోని సర్కిల్-12 పరిధిలో మెప్మా, నాక్ సంయుక్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు నాక్ డైరెక్టర్ జనరల్ బిక్షపతి తెలిపారు. నిరుద్యోగులకు నిర్మాణ రంగంలో 3 నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఎక్స్‌వెటర్ ఆపరేటర్, హై వే వర్క్ సూపర్‌వైజర్, స్టోర్ కీపర్, ప్లంబింగ్, శానిటేషన్, పెయింటింగ్, డెకరేషన్, ఎలక్ట్రికల్, హౌసింగ్ వైర్, సోలార్ ఎలక్ట్రిక్ సిస్టమ్ కోర్సులపై శిక్షణ ఇవ్వనున్నామన్నారు. డిసెంబర్ 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాన్నారు. ఈ కోర్సులపై ఆసక్తి గల నిరుద్యోగులు 7వ తరగతి నుంచి డిగ్రీ అర్హత కలిగిన వారికి అవకాశముందన్నారు. అభ్యర్థులు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, స్టడీ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌లతో పాటు ఆరు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు జత చేసి నేషనల్ ఆకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్, నాక్ క్యాంపస్, కొత్తగూడ, హైదరాబాద్ అడ్రస్‌కు పంపాలని తెలిపారు. వివరాలకు 040-23111916, 23111917, 912168 2879 నెంబర్లుకు సంప్రదించాలని సూచించారు.