notifications

ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు

Webdesk | Saturday, February 17, 2018 9:55 AM IST

ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు

  మేడ్చల్ : ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకంలో భాగంగా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి నిరుద్యోగులుగా ఉన్న అభ్యర్థులకు మేడ్చల్, అల్వాల్‌లోని ప్రభుత్వ ఐటీఐలలో ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల ఒక తెలిపారు. అల్వాల్ ఐటీఐలో అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ కోర్సు, మేడ్చల్ ఐటీఐలో ఫీల్డ్ టెక్నీషియన్ హోమ్ అప్లయోన్స్, గ్యాస్ టంగ్‌స్టన్, ఆర్క్ వెల్డింగ్ కోర్సులలో శిక్షణ ఉంటుందని, ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ఈ నెల 17న అల్వాల్ ఐటీఐలో జరుగనున్న కౌశల్ మేళాకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు తమతమ సర్టిఫికెట్లతో పాటు ఆధార్ కార్డును తీసుకురావాలని సూచించారు.