notifications

తెలంగాణ పోస్టల్‌లో ఎంటీఎస్‌లు

Webdesk | Sunday, December 10, 2017 10:59 AM IST

  పోస్టల్ శాఖ పరిధిలో పనిచేస్తున్న తెలంగాణ పోస్టల్ సర్కిల్ ఆర్‌ఎంఎస్/డివిజన్‌లలో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

 
-పదోతరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత
-రాతపరీక్ష ద్వారా ఎంపిక
-నెగెటివ్ మార్కింగ్ లేదు
-కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
-2018 జనవరి 8 చివరితేదీ

వివరాలు:

పోస్టల్ డిపార్ట్‌మెంట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో పనిచేస్తుంది. 
-పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) 
-మొత్తం పోస్టుల సంఖ్య: 33
-అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్‌లలో 11 ఖాళీలు (జనరల్-7, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-1)
-సబార్డినేట్ ఆఫీస్‌లలో 22 ఖాళీలు (జనరల్-14, ఓబీసీ-4, ఎస్సీ-2, ఎస్టీ-2)
-రీజియన్/డివిజన్ వారీగా పోస్టులు: సర్కిల్ ఆఫీస్-1, డీఏ (పీ) హైదరాబాద్-9, పీఎస్‌డీ హైదరాబాద్-1, హైదరాబాద్ సిటీ డివిజన్-1, సికింద్రాబాద్ డివిజన్-1, కరీంనగర్ డివిజన్-1, హన్మకొండ-1, హైదరాబాద్ సార్టింగ్ డివిజన్-9, ఆర్‌ఎంఎస్ జెడ్ డివిజన్ హైదరాబాద్-9 
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదోతరగతి/మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2018 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 18,000/-(7వ వేతన పే స్కేల్ ప్రకారం జీతం+ ఇతర అలవెన్స్‌లు ఉంటాయి)
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
-ఎంపిక: రాతపరీక్ష (ఆప్టిట్యూడ్ టెస్ట్) ద్వారా
-పరీక్ష కాలవ్యవధి - 120 నిమిషాలు
-నెగెటివ్ మార్కింగ్ లేదు.
-రాతపరీక్షలో పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఇస్తారు.
-ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు.
-ప్రతి విభాగంలో కనీస అర్హత మార్కులను సాధించాలి.
-పార్ట్-ఏ: 25 మార్కులు- 25 ప్రశ్నలు. దీనిలో జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీపై ప్రశ్నలు ఇస్తారు.
-పార్ట్-బీ: 25 మార్కులు, 25 ప్రశ్నలు. దీనిలో మ్యాథమెటిక్స్ సబ్జెక్టుపై ప్రశ్నలు ఇస్తారు.
-పార్ట్ సీ: ఇది రెండు భాగాలుగా ఉంటుంది. 25 మార్కులకు ఇంగ్లిష్, 25 మార్కులకు తెలుగు భాషపై ప్రశ్నలు ఇస్తారు.
-పార్ట్ ఏ, పార్ట్ బీలలో అభ్యర్థులు కనీస మార్కులుగా జనరల్-10, ఓబీసీ- 9, ఎస్సీ/ఎస్టీ-8 మార్కులను సాధించాలి.
-పార్ట్ సీ (ప్రతి విభాగంలో) కనీస మార్కులుగా జనరల్-10, ఓబీసీ- 9, ఎస్సీ, ఎస్టీ-8 మార్కులను సాధించాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: 2018 జనవరి 8
-అప్లికేషన్ ఫీజు: రిజిస్ట్రేషన్ ఫీజు - 
రూ. 100/, ఎగ్జామినేషన్ ఫీజు 
రూ. 400/-ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు. 
-ఫీజును తెలంగాణలోని ఎంపిక చేసిన ప్రధాన పోస్ట్ ఆఫీసుల్లో చెల్లించవచ్చు.
-వెబ్‌సైట్: www.telanganapostalcircle.in