notifications

స్వయం ఉపాధి పథకాలపై శిక్షణ

Webdesk | Friday, February 23, 2018 9:33 AM IST

 హైదరాబాద్: ఖాదీ గ్రామోద్యోగ మహా విద్యాలయ ఆధ్వర్యంలో పలు స్వయం ఉపాధి పథకాల మీద నిరుద్యోగ యువతకు శిక్షణనివ్వనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి సుధాకర్‌రావు తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 13 కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నామన్నారు. అత్యల్ప పెట్టుబడితో అధిక ప్రయోజనాలు చేకూరే స్వయం ఉపాధి పథకాల్లో మన యువతకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. కనీసంగా 25 ఆపై ఎక్కువ సంఖ్యలో బృందంగా ఏర్పడితే వారికి జట్టు శిక్షణ ఇస్తామన్నారు. ఇందుకోసం కనీసం ఎస్సెస్సీ ఉత్తీర్ణతగా నిర్ణయించామని, జిల్లాలో గల యువత ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు ఫోన్: 040 -2970 4618, 94408 14617, 94408 14610, 94408 18222 నంబర్లలో సంప్రదించాలన్నారు. కోర్సులివే: ఆహార పదార్థాలు, బేకరీ, మసాలా ఉత్పత్తులు, పాపడ్ తయారీ, నాన్ ఓపెన్ బ్యాగ్స్, కొవ్వొత్తులు, అగర్‌బత్తీలు, చాక్‌పీస్‌ల తయారి, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఆకులతో తయారయ్యే ప్లేట్లు, గ్లాసులు, హెర్బల్ ఉత్పత్తులు (డిటర్జెంట్స్, పౌడర్, సబ్బులు, ఫినాయిల్, సహజసిద్ధ ఎరువులు, చేతితో తయారయ్యే కాగితపు ఉత్పత్తులు, వెల్డింగ్, కుమ్మరి పరిశ్రమ, కంప్యూటర్ శిక్షణ, జనపనారతో తయారయ్యే ఉత్పత్తులు, స్టూడియో పాటరి, వేప పిండి తయారీ.