notifications

రిమోట్ సెన్సింగ్‌లో సైంటిస్టులు

Webdesk | Friday, January 26, 2018 10:47 AM IST

 హైదరాబాద్, బాలానగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)లో సైంటిస్ట్/ఇంజినీర్ - ఎస్‌సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:ఎన్‌ఆర్‌ఎస్‌సీ అనేది ఇస్రో పరిధిలోని సంస్థ. శాటిలైట్ డాటా సేకరణ, భద్రపర్చడం, నిర్వహించడం, రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ తదితరాల కోసం దేశవ్యాప్తంగా ఐదు సెంటర్లు ఉన్నాయి. వాటిలో బాలానగర్ ఒకటి. మిగిలినవి బెంగళూరు, నాగపూర్, కోల్‌కతా, జోధ్‌పూర్, న్యూఢిల్లీలో ఉన్నాయి. వీటికి అనుబంధంగా షాద్‌నగర్‌లో ఎర్త్ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
-పోస్టు: సైంటిస్ట్/ఇంజినీర్ - ఎస్‌సీ
-పేస్కేల్: సైంటిస్ట్ ఎస్‌సీ పోస్టుకు రూ. 56,100 
-సైంటిస్ట్ ఎస్‌డీ పోస్టులకు రూ. 67,000/- 
-సైంటిఫిక్ అసిస్టెంట్ - రూ. 44,900/- 
-విభాగాల వారీగా ఖాళీలు, అర్హతలు...
-సైంటిస్ట్ - 8
-అర్హతలు: ఎమ్మెస్సీ అగ్రికల్చర్ ఫిజిక్స్/ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ లేదా అగ్రికల్చర్ మెట్రాలజీ లేదా సాయిల్ ఫిజిక్స్ లేదా ప్లాంట్ ఫిజియాలజీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు బీఎస్సీ అగ్రికల్చర్ చదివి ఉండాలి. రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-సైంటిస్ట్ - 2 ఖాళీలు
-అర్హతలు: కనీసం 65 శాతం మార్కులతో ఎంటెక్ హైడ్రాలజీ/వాటర్ రిసోర్సెస్‌తోపాటు ఫస్ట్‌క్లాస్ (65 శాతం)లో బీటెక్‌లో సివిల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
-సైంటిస్ట్ - 3 ఖాళీలు
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఎంటెక్ అప్లయిడ్ జియాలజీ/జియాలజీ లేదా తత్సమాన కోర్సు లేదా ఎమ్మెస్సీ/ఎమ్మెస్సీ టెక్నాలజీ ఇన్ అప్లయిడ్ జియాలజీ/జియాలజీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డిగ్రీలో జియాలజీ లేదా తత్సమానకోర్సు.
-సైంటిస్ట్ - 1 పోస్టు
-అర్హతలు: బీఎస్సీ జాగ్రఫితోపాటు ఎమ్మెస్సీ జాగ్రఫి లేదా అప్లయిడ్ జాగ్రఫిలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-సైంటిస్ట్ - 8 ఖాళీలు
-అర్హతలు: రిమోట్ సెన్సింగ్/జియోమాటిక్స్/జీఐఎస్ లేదా జియోఇన్ఫర్మాటిక్స్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత. లేదా బీఈ/బీటెక్‌లో సివిల్ లేదా ఈసీఈ లేదా ఈటీఎం/సీఎస్‌ఈ/ఐటీలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత. లేదా ఎమ్మెస్సీ మ్యాథ్స్/స్టాటిస్టిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్/ జాగ్రఫి లేదా జియాలజీలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-సైంటిస్ట్ - 8 పోస్టులు
-అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఎంఈ/ఎంటెక్ కంప్యూటర్ ఇంజినీరింగ్/ఐటీతోపాటు 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో సీఎస్‌ఈ/ఐటీ ఉత్తీర్ణత.
-సైంటిస్ట్ - 1 ఖాళీ
-అర్హత: బీఈ/బీటెక్ ఎలక్ట్రానిక్స్‌లో కనీసం 65 శాతం మార్కులతోపాటు ఎంఈ/ఎంటెక్‌లో మైక్రోవేవ్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 
-సైంటిస్ట్ - 1 పోస్టు
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటేనెన్స్ ఇంజినీరింగ్ లేదా ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన సబ్జెక్టులో ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత.
-సైంటిస్ట్ - 1 ఖాళీ
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎంటెక్/ ఎంఎస్ ఫిజిక్స్/ కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్/అట్మాస్ఫియరిక్ సైన్సెస్ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత. 
-సైంటిస్ట్ - 1 ఖాళీ
-అర్హత: పీహెచ్‌డీలో అట్మాస్ఫియరిక్ మోడలింగ్‌తోపాటు ఎంటెక్/ఎమ్మెస్సీ ఫిజిక్స్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-సైంటిస్ట్ - 1
-అర్హత: పీహెచ్‌డీ మెరైన్ బయాలజీతోపాటు పీజీలో మెరైన్ సైన్సెస్ చదివి ఉండాలి.
-సైంటిఫిక్ అసిస్టెంట్ - 2 ఖాళీలు
-అర్హతలు: బీఎస్సీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్‌లో ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: 18 - 35 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
-పనిచేయాల్సిన ప్రదేశం: షాద్‌నగర్, బాలానగర్‌తోపాటు అవసరమైనప్పుడు దేశంలోని ఇస్రో, డీవోఎస్ సెంటర్లలో పనిచేయాల్సి ఉంటుంది.