notifications

రామగుండంలో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు

Webdesk | Sunday, January 21, 2018 11:27 AM IST

  న్యూఢిల్లీలోని రామగుండం ఫెర్టిలైజర్స్ & కెమికల్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) టెక్నికల్ విభాగంలో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 


వివరాలు: ఆర్‌ఎఫ్‌సీఎల్ అనేది నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమెటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్), ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్), ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆప్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐఎల్) సంస్థల జాయింట్ వెంచర్ కంపెనీ. ఎన్‌ఎఫ్‌ఎల్‌ను న్యూఢిల్లీలో 1974 ఆగస్టు 23న ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ
-మొత్తం పోస్టుల సంఖ్య: 46
విభాగాలవారీగా ఖాళీలు: 
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (కెమికల్)-35 (జనరల్-19, ఓబీసీ-9, ఎస్సీ-5, ఎస్టీ-2)
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (మెకానికల్)-10 (జనరల్-7, ఓబీసీ-2, ఎస్సీ-1)
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎలక్ట్రికల్)-8 (జనరల్-5, ఓబీసీ-2, ఎస్సీ-1)
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఇన్‌స్ట్రుమెంటేషన్)-8 (జనరల్-5, ఓబీసీ-2, ఎస్సీ-1)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్షలో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచిలో గేట్ స్కోర్ -2016లో
అర్హత సాధించాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి. 
-వయస్సు: 2018 జనవరి 1 నాటికి 27 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులు పదేండ్లవరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
-పే స్కేల్: రూ. 16,400-40,500/- డీఏ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్, తదితర సౌకర్యాలు కల్పిస్తారు. మేనేజ్‌మెంట్ ట్రెయినీగా ఎంపికైన అభ్యర్థులకు 
ఏడాదికి సుమారుగా రూ. 7.53 లక్షలు జీతం సంస్థ చెల్లిస్తుంది.
-దరఖాస్తు ఫీజు: రూ. 700/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: గేట్ -2016 స్కోర్- +ఇంటర్వ్యూ 
-గేట్ -2016 స్కోర్‌కు 80 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
-దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 9 
(సాయంత్రం 5.30 గంటలకు)
-వెబ్‌సైట్: www.nationalfertilizers.com