notifications

ఎన్‌ఎండీసీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Webdesk | Thursday, January 4, 2018 1:06 PM IST

 హైదరాబాద్‌లోని ఎన్‌ఎండీసీ లిమిటెడ్ మెయింటేనెన్స్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

వివరాలు:ఎన్‌ఎండీసీ ఒక నవరత్న కంపెనీ. కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థ. మైనింగ్, మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ సంబంధిత కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 
-మొత్తం ఖాళీల సంఖ్య - 101
విభాగాల వారీగా ఖాళీలు, అర్హతలు:
-మెయింటేనెన్స్ అసిస్టెంట్ (మెకానికల్) ట్రెయినీ - 45 ఖాళీలు
-అర్హతలు: ఐటీఐ వెల్డింగ్/ఫిట్టింగ్ లేదా మోటార్ మెకానిక్ లేదా డీజిల్ మెకానిక్ లేదా ఆటో ఎలక్ట్రీషియన్.
-మెయింటేనెన్స్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) (ట్రెయినీ) - 47 ఖాళీలు
-అర్హతలు: ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ ఉత్తీర్ణత.
-పేస్కేల్: పై రెండు పోస్టులకు మొదటి 12 నెలలు రూ.11,000/- ఇస్తారు. తర్వాతి ఆరు నెలలు రూ. 11,500/- ఇస్తారు. రెగ్యులర్ అయిన తర్వాత రూ. 11,330 - 3% - 20,000/- ఇస్తారు.
-గ్రేడ్ -3 అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ - 1 ఖాళీ
-అర్హతలు: ఫిజియోథెరపి డిగ్రీ. పెద్ద వైద్యశాల/నర్సింగ్‌హోంలో మూడేండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
-గ్రేడ్ -3 అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ - 1
-అర్హతలు: సైన్స్ గ్రాడ్యుయేషన్ + మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్‌లో సర్టిఫికెట్ కోర్సు లేదా పదోతరగతితోపాటు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌లో డిప్లొమా
-అనుభవం: డిగ్రీ కోర్సు చేసిన తర్వాత రెండేండ్ల అనుభవం ఉండాలి. దీనిలో కనీసం ఏడాదైనా ల్యాబ్‌లో పనిచేసిన అనుభవం. పదోతరగతి ఉత్తీర్ణులైనవారికి ఐదేండ్ల అనుభవం ఉండాలి. దీనిలో కనీసం నాలుగేండ్లు ల్యాబ్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి.
-గ్రేడ్ - 3 అసిస్టెంట్ ఫార్మాసిస్ట్ (ట్రెయినీ) - 1
-అర్హతలు: పదోతరగతి/సైన్స్ గ్రాడ్యుయేషన్‌తోపాటు సర్టిఫికెట్/ఫార్మసీలో డిప్లొమా లేదా ఫార్మసీ డిగ్రీ ఉత్తీర్ణత.
-గ్రేడ్ -3 అసిస్టెంట్ డైటీషియన్ (ట్రెయినీ) - 1
-అర్హతలు: బీఎస్సీ/హోం సైన్స్‌లో డిగ్రీతోపాటు డైటిక్స్‌లో డిప్లొమా లేదా బీఎస్సీ న్యూట్రిషియన్/డైటిక్స్ లేదా బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
-పేస్కేల్: పై నాలుగు పోస్టులకు మొదటి 12 నెలలు రూ. 12,000/-, తర్వాత ఆరునెలలు రూ. 12,500/- ఇస్తారు. రెగ్యులర్ అయిన తర్వాత రూ. 11,670-3% -20,600/- ఇస్తారు. 
-గ్రేడ్ - 2 హెచ్‌ఈఎం (మెకానికల్) ట్రెయినీ - 5 
-అర్హతలు: మెకానికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత. హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-పేస్కేల్: మొదటి 12 నెలలు రూ. 12,000/-, తర్వాత ఆరునెలలు రూ. 12,500/- ఇస్తారు. రెగ్యులర్ అయిన తర్వాత రూ. 12,030-3% -21,220/- ఇస్తారు. 
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌టెస్ట్/జాబ్ ప్రొఫిషియన్సీ టెస్ట్
-స్టేజ్ - 1: రాతపరీక్ష. 100 మార్కులకు ఉంటుంది.
-ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీలో ఉంటుంది. ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. (ఓఎంఆర్ పద్ధతిలో) 
-పరీక్షలో సబ్జెక్టు నాలెడ్జ్ (సంబంధిత ట్రేడ్) -30 మార్కులు. జనరల్ నాలెడ్జ్ - 50 మార్కులు, న్యూమరికల్ రీజనింగ్ ఎబిలిటీ - 20 మార్కులు.
-రాతపరీక్షలో ఎస్సీ/ఎస్టీలకు 30 మార్కులు, ఓబీసీలకు 35 మార్కులు, జనరల్ - 40 మార్కులు క్వాలిఫయింగ్‌గా నిర్ణయించారు. 
-రాతపరీక్షలో అర్హత సాధించినవారిని మాత్రమే ట్రేడ్‌టెస్ట్‌కు అనుమతిస్తారు. 
-స్టేజ్ - 2: ట్రేడ్‌టెస్ట్/జాబ్ ప్రొఫిషియన్సీ టెస్ట్
-ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో/ఆఫ్‌లైన్‌లో
-ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదీ: జనవరి 27
-ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 28
-ఫీజు: రూ. 150/-
-దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
-పోస్ట్ బాక్స్ నంబర్: 1352 పోస్ట్ ఆఫీస్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ - 28.
-హెల్ప్‌లైన్: 09674524077 
-వెబ్‌సైట్: www.nmdc.co.in