notifications

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

Webdesk | Monday, January 22, 2018 11:12 AM IST

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

  హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దీన్‌దయాల్ అంత్యోదయ యోజన పథకంలో భాగంగా మెప్మా, జీహెచ్‌ఎంసీ, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో సాబ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (హెల్త్ అసిస్టెంట్స్) కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ స్టేట్ కో ఆర్డినేటర్ డి. అనిల్ తెలిపారు. మూడున్నర నెలల పాటు ఈ కోర్సు కొనసాగుతుందని, కోర్సు పూర్తి చేసి ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగం కూడా కల్పిస్తామని అన్నారు. దిల్‌సుక్‌నగర్ చైతన్యపురిలోని స్పేస్ దవాఖానలో త్వరలో తరగతులు ప్రారంభమవుతాయని, 18 పైబడి 35 సంవత్సరాల లోపల ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశమని, మరిన్ని వివరాలకు 8142353283 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.