notifications

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

Webdesk | Thursday, February 15, 2018 10:32 AM IST

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

  హైదరాబాద్: శేరిలింగంపల్లిలోని ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ కేటగిరిల్లో ఉచిత శిక్షణతోపాటు వారికి ఉపాధిని కల్పించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మ్యూచ్‌వల్ ఫండ్ ఎజెంట్, డొమెస్టిక్ ఐటీ హెల్ప్‌డెస్క్ అటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్ టెక్నిషీయన్, హోటల్ మేనేజ్‌మెంట్, ఆఫ్టికల్ ఫైబర్ టెక్నీషియన్ కోర్సులకు ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 18-35 లోపు వయసు ఉండి 5వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు తమ సరిఫికెట్లు, ఆధార్, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ జిరాక్స్‌తోపాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో లింగంపల్లి రైల్వేస్టేషన్‌లోని ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో దరఖాస్తులు అందించవచ్చని కేంద్రం నిర్వాహకులు తెలిపారు. వివరాలకు సెల్: 7731870274, 70329 13133లలో సంప్రదించాలని కోరారు.