notifications

ఎన్‌ఐఈపీఐడీలో ఫ్యాకల్టీ పోస్టులు

Webdesk | Wednesday, February 28, 2018 12:58 PM IST

ఎన్‌ఐఈపీఐడీలో ఫ్యాకల్టీ పోస్టులు

 సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఎంపర్‌మెంట్ ఆఫ్ పర్సన్ విత్ ఇంటలెక్చువల్ డిసెబిలిటీస్ (ఎన్‌ఐఈపీఐడీ-దివ్యజ్ఞాన్) ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఎన్‌ఐఈపీఐడీ సికింద్రాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో, నోయిడా, నవీ ముంబై, కోల్‌కతాలో ఉన్న ప్రాంతీయ కేంద్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. 

 
టీచింగ్/ప్రొఫెషనల్ పోస్టులు
-అసిస్టెంట్ ప్రొఫెసర్ (రిహాబిలిటేషన్ సైకాలజీ, స్పెషల్ ఎడ్యుకేషన్, మెడికల్ సైన్స్, ప్రోగ్రామర్ (సాఫ్ట్‌వేర్), లెక్చరర్ (రిహాబిలిటేషన్ సైకాలజీ, స్పెషల్ ఎడ్యుకేషన్, మెడికల్ సైన్స్, ఫిజియోథెరపీ), రిహాబిలిటేషన్ థెరపిస్ట్ (స్పీచ్, ఫిజియోథెరపీ, ఎర్లీ ఇంటర్వెన్షన్, ఈసీఎస్‌ఈ టీచర్), స్పెషల్ ఎడ్యుకేటర్ లెవల్, వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, హెడ్‌మాస్టర్, టీచర్స్ (జనరల్, మ్యూజిక్, డ్యాన్స్), ఫార్మాసిస్ట్
నాన్ టీచింగ్ పోస్టులు
-సెక్షన్ ఆఫీసర్, డాటా ఎంట్రీ ఆపరేటర్
-అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. 
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా 
-ఇంటర్వ్యూ తేదీలు: నోయిడాలో మార్చి 5, 6,నవీ ముంబైలో మార్చి 8, 9న, కోల్‌కతాలో మార్చి 12, 13న, సికింద్రాబాద్‌లో మార్చి 19, 20 తేదీల్లో.
-వెబ్‌సైట్: www.niepid.nic.in