notifications

మిధానిలో ట్రేడ్ అప్రెంటిస్‌లు

Webdesk | Monday, March 5, 2018 9:52 AM IST

మిధానిలో ట్రేడ్ అప్రెంటిస్‌లు

 హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: ఇది భారత ప్రభుత్వరంగ సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య: 40
-పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
-విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-15, వెల్డర్-5, ఎలక్ట్రీషియన్-10, మెషినిస్ట్-5, టర్నర్-5 
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. 
-వయస్సు: మార్చి 10 నాటికి 15 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
-ట్రెయినింగ్ వ్యవధి: ఏడాది
-ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. అర్హులైన అభ్యర్థులు మొదట www.apprenticeship.gov.in అనే వెబ్‌సైట్‌లో రిజస్టర్ చేసుకోవాలి. దీనిద్వారా యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అవుతుంది.ఆ తర్వాత ట్రేడ్ అప్రెంటిస్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
-చివరితేదీ: మార్చి 10
-వెబ్‌సైట్: www.ncvtmis.gov.in