notifications

‘న్యూ ఇండియా’లో 984 అసిస్టెంట్లు

webdesk | Tuesday, February 28, 2017 9:33 PM IST

న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ పబ్లిక్ సెక్టార్ సంస్థ. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది. పూర్తిగా భారత ప్రభుత్వ పరిధిలో ఇది పనిచేస్తుంది. ముంబై ప్రధాన కార్యాలయంగా న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ను టాటా హౌస్ ఫౌండర్ సభ్యుడు సర్ థోరాబ్ టాటా 1919 జూలై 23న స్థాపించారు. 1973లో జాతీయం చేశారు.
పోస్టు పేరు: అసిస్టెంట్

మొత్తం ఖాళీల సంఖ్య - 984 
పేస్కేల్: రూ. 14,435-40,080/-మెట్రోపాలిటిన్ పట్టణాల్లో నెలకు సుమారుగా రూ. 23,000/- వరకు వస్తాయి. వీటికి తోడు కంపెనీ నిబంధనల ప్రకారం మరికొన్ని అలవెన్స్‌లు ఇస్తారు.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 2016, జూన్ 30 నాటికి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత రాష్ట్ర/ప్రాంతీయ భాషలో పరిజ్ఞానం ఉండాలి.

వయస్సు: 2016, జూన్ 30 నాటికి 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1988, జూలై 1 నుంచి 1998, జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ద్వారా
ఫేజ్ - 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: 


-ఇది ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
-పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాలపైన పరీక్ష నిర్వహిస్తారు. 
 

ఫేజ్ - 2 మెయిన్ ఎగ్జామినేషన్: 

-దీనిలో కూడా ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాలపైన పరీక్ష నిర్వహిస్తారు. 
-మెయిన్ ఎగ్జామ్ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు
-పరీక్షలో ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. 1/4 వంతు మార్కులను కోతవిధిస్తారు. 
-తుది ఎంపిక మెయిన్ ఎగ్జామ్ మార్కుల ఆధారంగా చేస్తారు. 
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
 

ముఖ్యమైన తేదీలు: 
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: మార్చి 6
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 29 
ప్రిలిమినరీ ఎగ్జామ్: ఏప్రిల్ 22, 23
మెయిన్ ఎగ్జామ్: మే 23
వెబ్‌సైట్: WWW.NEWINDIA.CO.IN