notifications

జేఎన్‌యూలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

Webdesk | Friday, January 5, 2018 12:19 PM IST

జేఎన్‌యూలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

 న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.


వివరాలు: 
-పోస్టు పేరు: ప్రొఫెసర్
-మొత్తం ఖాళీల సంఖ్య: 90 (జనరల్-57, ఓబీసీ-13, ఎస్సీ-10, ఎస్టీ-10)
-ప్రొఫెసర్-24 పోస్టులు (జనరల్-21, ఎస్సీ-2, ఎస్టీ-1)
-పే స్కేల్: రూ. 37,400-67,000 + అకడమిక్ గ్రేడ్ పే రూ.10,000/-
-అసోసియేట్ ప్రొఫెసర్-27 పోస్టులు (జనరల్-19, ఎస్సీ-4, ఎస్టీ-4)
-పే స్కేల్: రూ. 37,400-67,000+అకడమిక్ గ్రేడ్ పే రూ.9,000/-
-అసిస్టెంట్ ప్రొఫెసర్-39 పోస్టులు (జనరల్-17, ఓబీసీ-13, ఎస్సీ-4, ఎస్టీ-5)
-పే స్కేల్: రూ. 15,600-39,100+అకడమిక్ గ్రేడ్ పే రూ. 6,000/-
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ లేదా ఎమ్మెస్సీ, ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీబీఎస్+ఎండీ, బీవీఎస్సీ+ఎంవీఎస్సీ, బీఈ/బీటెక్‌తోపాటు ఎంటెక్‌లో ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ లేదా నెట్/స్లెట్, యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్‌లో అర్హత సాధించాలి. సంబంధిత రిసెర్చ్/టీచింగ్ విభాగంలో అనుభవం ఉండాలి
-ఎంపిక : రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా-దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో విద్యార్హత, టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ తదితర వివరాలను సంబంధిత పర్సనల్ 
అధికారికి పంపించాలి.

-చివరితేది : జనవరి 29 (సాయంత్రం 5 గంటల వరకు)

-వెబ్‌సైట్: www.jnu.ac.in