notifications

ఐఐఐటీహెచ్‌లో యూజీ కోర్సులు

Webdesk | Monday, February 19, 2018 8:41 PM IST

ఐఐఐటీహెచ్‌లో యూజీ కోర్సులు

  హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

 
వివరాలు: ఐఐఐటీ హైదరాబాద్‌ను 1998లో ప్రారంభించారు. ఈ సంస్థ లాభాపేక్షలేని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (ఎన్-పీపీపీ) కింద ప్రారంభమైన స్వతంత్ర సంస్థ. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ తదితర విభాగాల్లో పరిశోధనల కోసం ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటుచేశారు.
-కోర్సులు: అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రోగ్రామ్స్. 2018 -19 విద్యాసంవత్సరానికి ఈ ప్రవేశాలు.
నాలుగు విధాలుగా ఐఐఐటీలో ప్రవేశాలు కల్పిస్తారు. వివరాలు..
1. జేఈఈ (మెయిన్) స్కోర్ ఆధారంగా
2. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (యూజీఈఈ)
3. ఒలింపియాడ్
4. స్పెషల్ చానెల్ ఆఫ్ అడ్మిషన్ (ఎస్‌పీఈసీ)
-జేఈఈ (మెయిన్): జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా బీటెక్ (సీఎస్‌ఈ) - 90 సీట్లు, బీటెక్ (ఈసీఈ) -60 సీట్లు భర్తీ చేస్తారు.
-అర్హతలు: జేఈఈ మెయిన్ స్కోర్, ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
నోట్: ఐఐఐటీహెచ్ పోర్టల్ ద్వారా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. 
-అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (యూజీఈఈ): ఈ ఎంట్రెన్స్ ద్వారా రిసెర్చ్ ఆధారిత డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 
-కోర్సులు: బీటెక్ కంప్యూటర్‌సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అండ్ మాస్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌డీ)
-బీటెక్ (ఈసీడీ), బీటెక్ (సీఎల్‌డీ), బీటెక్ (సీఎన్‌డీ)
-అర్హత: ఇంటర్/తత్సమాన పరీక్షలో కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఉత్తీర్ణత. 
-సీట్ల సంఖ్య - సీఎస్‌డీ - 35, ఈసీడీ - 25, సీఎన్‌డీ - 15, సీఎల్‌డీ - 15
-ఎంపిక: ఏప్రిల్ 18న నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-అప్లికేషన్ ఫీజు: రూ. 2,000/-
-చివరితేదీ: మార్చి 15
-యూజీఈఈలో ఉత్తీర్ణులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది జాబితాను రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. అంతర్జాతీయ స్థాయి ఒలింపియాడ్స్‌లో పాల్గొన్న విద్యార్థులు నేరుగా డ్యూయల్ డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి రాతపరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
స్పెషల్ చానెల్ ఆఫ్ అడ్మిషన్ (ఎస్‌పీఈసీ):
-ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా ఈ స్కీం ప్రవేశపెట్టారు. దీని ద్వారా బీటెక్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
-కోర్సులు: బీటెక్ (సీఎస్‌ఈ) -10 సీట్లు, 
బీటెక్ (ఈసీఈ) - 10 సీట్లు
-అర్హతలు: ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉత్తీర్ణతతోపాటు కింది ఏదైనా ఒక అర్హత కలిగి ఉండాలి.
1. సీబీఎస్‌ఈ ఉడాన్ స్కీంకు ఎంపికైన విద్యార్థులు
2. ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు చదువుతూ రెండో ఏడాది పూర్తిచేసుకున్న విద్యార్థులు (అంటే బాసర ఐఐఐటీలో బీటెక్ చదువుతున్నవారు)
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మార్చి 15
-ఎంట్రెన్స్ టెస్ట్: ఏప్రిల్ 18
-వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
డైరెక్ట్ ఆడ్మిషన్స్ ఫర్ స్టూడెంట్స్ అబ్రాడ్ (డీఏఎస్‌ఏ):
-ప్రవాస భారతీయ విద్యార్థులు, విదేశాల్లో నివసిస్తున్న భారత సంతతి విద్యార్థులకు నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. 
-ఎంపిక: శాట్‌లో నిర్దేశిత స్కోర్ సాధించి ఉండాలి.
-అర్హతలు: ఇంటర్/తత్సమాన పరీక్షలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులుగా కలిగి ఉండాలి. 
-కోర్సులు: సీఎస్‌ఈ & సీఎస్‌డీ - 20, ఈసీఈ & ఈసీడీ - 10, ఇతర ప్రోగ్రామ్స్ - 5 సీట్లు ఉన్నాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మార్చి 2 నుంచి ప్రారంభం
-చివరితేదీ: ఏప్రిల్ 25
-వెబ్‌సైట్: https://www.iiit.ac.in/admissions