notifications

ఎక్స్‌రే టెక్నీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

Webdesk | Thursday, December 28, 2017 11:51 AM IST

ఎక్స్‌రే టెక్నీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

  హైదరాబాద్: ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే టెక్నీషియన్స్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బెత్ల హాం పారామెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రసన్నకుమార్ తెలిపారు. నాచారం క్రాస్‌రోడ్‌లోని ప్రసాద్ దవాఖానలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్, బర్కత్‌పురాలోని వుడ్‌ల్యాండ్‌లో ఎక్స్‌రే టెక్నీషియన్ కోర్సులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నాలుగు నెలల పాటు కొనసాగే ఈ కోర్సు పూర్తి చేసుకున్న వారికి కార్పొరేట్ దవాఖానల్లో ప్లేస్ మెంట్ కూడా కల్పించనున్నట్లు తెలిపారు. ఆయా ఉద్యోగాల్లో నెలకు రూ.12 వేల నుంచి రూ. 15 వేల వరకు వేతనం వస్తుందని, ఈ శిక్షణా కాలంలో యూనిఫామ్, పుస్తకాలు కూడా ఉచితంగా ఇస్తామని, కోర్సు పూర్తయిన వారికి కేంద్ర ప్రభుత్వ ఆమోదిక సర్టిఫికేట్లు అందచేస్తామన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు వారు ఈ కోర్సులో చేరవచ్చని, వివరాలకు 9908098903 నెంబరులో సంప్రదించాలని కోరారు.