notifications

ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీలు

Webdesk | Saturday, December 23, 2017 7:21 PM IST

ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీలు

 హైదరాబాద్ (సనత్‌నగర్)లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పరిధిలో పనిచేస్తున్న ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

 
వివరాలు:ఈఎస్‌ఐసీని మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1952 ఫిబ్రవరి 24న స్థాపించారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 61 (ఈ పోస్టులను కోల్‌కతా, సనత్‌నగర్ ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీల్లో భర్తీచేస్తారు)
-విభాగాలు: అనెస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బ్లడ్ బ్యాంక్ హెమటాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పిడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ, సైకియాట్రి, రేడియాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్/టీబీ/చెస్ట్.
-సనత్‌నగర్ ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీలో- 36 పోస్టులు (ప్రొఫెసర్-13, అసోసియేట్ ప్రొఫెసర్-17, అసిస్టెంట్ ప్రొఫెసర్-6)
-కోల్‌కతా ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీలో- 25 పోస్టులు (ప్రొఫెసర్-9, అసోసియేట్ ప్రొఫెసర్- 12, అసిస్టెంట్ ప్రొఫెసర్-4)

అర్హతలు: 
- ప్రొఫెసర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్)లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగం నుంచి పీజీ, పీహెచ్‌డీలో ఉతీర్ణత, సంబంధిత టీచింగ్ రంగంలో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో మూడేండ్ల అనుభవం ఉండాలి.

-అసోసియేట్ ప్రొఫెసర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్)లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగం నుంచి పీజీ, పీహెచ్‌డీలో ఉతీర్ణత, సంబంధిత టీచింగ్ రంగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్ స్థాయిలో ఐదేండ్ల అనుభవం ఉండాలి.

-అసిస్టెంట్ ప్రొఫెసర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్)లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగం నుంచి పీజీ, పీహెచ్‌డీలో ఉతీర్ణత, సంబంధిత టీచింగ్ రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.

-వయస్సు: 50 ఏండ్లకు మించరాదు.

పే అండ్ అలవెన్స్‌లు:
-ప్రొఫెసర్‌కు రూ. 37,400-67,000+గ్రేడ్ పే రూ. 8700+ఎన్‌పీఏ
-అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ. 15,600-39,100+గ్రేడ్ పే రూ. 7600+ఎన్‌పీఏ
-అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ. 15,600-39,100+గ్రేడ్ పే రూ. 6600+ఎన్‌పీఏ 
-అప్లికేషన్ ఫీజు: రూ. 225 (డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో). ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఈఎస్‌ఐ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: సబ్జెక్టులవారీగా వివిధ తేదీల్లో ఈఎస్‌ఐసీ సెలక్షన్ బోర్డు సనత్‌నగర్, కోల్‌కతాలో ఇంటర్వ్యూను నిర్వహించి ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
-ఇంటర్వ్యూ రోజున సంబంధిత కోల్‌కతా, సనత్‌నగర్ ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్స్‌తో సంబంధిత అధికారి వద్ద హాజరు కావాలి. 
-ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఐప్లె చేస్తే వేర్వేరుగానే దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా: 
ESIC Medical College
Sanathnagar, Hyderabad-38 
-దరఖాస్తులకు చివరితేదీ: 2018, జనవరి 16
-వెబ్‌సైట్: www.esicmchyd.ac.in