notifications

ఈసీఐఎల్‌లో ఇంజినీర్ ట్రెయినీలు

Webdesk | Thursday, January 18, 2018 7:34 PM IST

 హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) వివిధ జోనల్/బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ భర్తీకి అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:ఈసీఐఎల్ అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తున్న సంస్థ. దీన్ని 1967 ఏప్రిల్ 11న ఏర్పాటు చేశారు.
-పని చేసే ప్రదేశం: హెడ్ క్వార్టర్ (హైదరాబాద్)తోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఈసీఐఎల్ ఆఫీసుల్లో
-మొత్తం పోస్టుల సంఖ్య: 84
-విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-50, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్-20, మెకానికల్-14
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 65 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం) మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. గేట్-2018లో వ్యాలిడ్ స్కోర్ సాధించాలి.
-వయస్సు: 2017 డిసెంబర్ 31 నాటికి 25 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: ట్రెయినింగ్ పీరియడ్‌లో రూ. 38,430/- స్టయిపండ్ చెల్లిస్తారు. సంస్థ నింబంధన ప్రకారం ప్రావిడెంట్ ఫండ్, లీవ్ తదితర సౌకర్యాలు ఉంటాయి. శిక్షణ పూర్తయిన తర్వాత ఇంజినీర్ హోదాలో మొదటి ఏడాదికి రూ. 47,780/-, రెండో ఏడాదికి రూ. 49, 210/-, మూడో ఏడాదికి రూ. 50, 690/- చెల్లిస్తారు. కాంట్రాక్టు నియమాకాన్ని విజయవంతంగా మూడేండ్లపాటు పూర్తిచేసిన తర్వాత టెక్నికల్ ఆఫీసర్ హోదాలో సుమారుగా నెలకు రూ. 52, 210/- చెల్లిస్తారు. 
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ట్రెయినింగ్ పీరియడ్: ఏడాది
-ప్రొబేషనరీ పీరియడ్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా దేశంలో ఏక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.
-ఎంపిక: గేట్-2018 స్కోర్, ఇంటర్వ్యూ
-ఇంటర్వ్యూకు 1:5 నిష్పత్తిలో ఎంపికచేస్తారు
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న 
ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్‌చేయాలి. హాల్ టికెట్, ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాలను ఈ-మెయిల్ ఐడీ ద్వారా తెలియజేస్తారు.
-చివరితేదీ: ఫిబ్రవరి 15
-వెబ్‌సైట్: http://careers.ecil.co.in