notifications

డీఆర్‌డీవోలో జేఆర్‌ఎఫ్

Webdesk | Tuesday, February 20, 2018 12:22 PM IST

డీఆర్‌డీవోలో జేఆర్‌ఎఫ్

  న్యూఢిల్లీలోని డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ (డీఈఎస్‌ఐడీవోసీ) ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:డీఈఎస్‌ఐడీవోసీ అనేది డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో పనిచేస్తుంది. 
-పోస్టు: జేఆర్‌ఎఫ్- 3 పోస్టులు 
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ (బేసిక్ సైన్స్) + నెట్ లేదా బీఈ/బీటెక్‌తోపాటు నెట్/గేట్ లేదా ఎంఈ/ఎంటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డాటా అనాలసిస్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, మేథమెటికల్ మోడలింగ్, విజువలైజేషన్ రంగంలో అనుభవం ఉండాలి.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 25,000+ హెచ్‌ఆర్‌ఏ అలవెన్సులు ఉంటాయి.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ లేదా ఈ -మెయిల్ ([email protected]) ద్వారా. సంబంధిత అర్హత, ఎక్స్‌పీరియన్స్ తదితర సర్టిఫికెట్లను జతపరిచి పర్సనల్ అధికారికి పంపాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 27
-వెబ్‌సైట్: www.drdo.gov.in