notifications

కోస్ట్‌గార్డ్‌లో నావిక్ పోస్టులు

Webdesk | Wednesday, December 27, 2017 12:18 PM IST

  రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఖాళీగా ఉన్న నావిక్ జనరల్ డ్యూటీ (10+2 ఎంట్రీ స్కీమ్- 02/2018 బ్యాచ్ ద్వారా) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

 

వివరాలు:భారత తీరప్రాంత రక్షణలో కోస్ట్‌గార్డ్ పాత్ర కీలకమైంది. చిన్నవయస్సులో కేంద్ర కొలువు. దేశరక్షణలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం, ప్రత్యేక అలవెన్స్‌లు ఇస్తారు. ఈ పోస్టులను 10+2 ఎంట్రీ స్కీమ్ కింద నావిక్ (జనరల్ డ్యూటీ) ఏడాదికి రెండుసార్లు భర్తీ చేస్తారు. 
-పోసు ్ట పేరు: - నావిక్ (జనరల్ డ్యూటీ)-10+2 ఎంట్రీ స్కీమ్
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10+2 లేదా ఇంటర్ ఉత్తీర్ణత. ఇంటర్‌లోని మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో తప్పనిసరిగా కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. 
-వయస్సు: 18 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. 1996, ఆగస్టు 1 నుంచి 2000 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

శారీరక ప్రమాణాలు:-ఎత్తు - 157 సెం.మీ ఉండాలి. ఛాతీ - శరీరానికి తగ్గ అనుపాతంలో ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం తప్పనిసరి. 
బరువు-ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. కంటిచూపు - 6/6, 6/9 నిష్పత్తిలో ఉండాలి.
-ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను ప్రతి జోన్ పరిధిలోని సెంటర్ ప్రకారం షార్ట్‌లిస్ట్ చేస్తారు.
-షార్ట్‌లిస్ట్ పొందిన అభ్యర్థులకు రాతపరీక్షను 2018 ఫిబ్రవరి- మార్చిలో నిర్వహిస్తారు. 
-రాతపరీక్షలో క్వాలిఫైయింగ్ మార్కులు ఒక్కొక్క జోన్‌సెంటర్ బట్టి ఎక్కవ, తక్కువగా ఉంటాయి.
-రాతపరీక్ష : ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో ఇంటర్ స్థాయిలోని మ్యాథ్స్, ఫిజిక్స్, బేసిక్ కెమిస్ట్రీ, ఇంగ్లిష్ నాలెడ్జ్ , జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
-రాతపరీక్షలో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్‌లను నిర్వహిస్తారు. ఈ పరీక్షల నిర్వహణకు 2 నుంచి 3 రోజులు పడుతుంది.
-అన్ని పరీక్షలు పూర్తిచేసిన మెరిట్ అభ్యర్థుల వివరాలను జోన్ పరిధిలోని ఖాళీల సంఖ్య ఆధారంగా 2018 జూలైలో ఇండియన్ కోస్ట్‌గార్డ్ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
-శిక్షణ: ఐఎన్‌ఎస్ చిల్కాలో ఆగస్టు 2018 నుంచి ప్రారంభమవుతుంది. కేటాయించిన ట్రేడ్‌కు సంబంధించి సముద్రంలో ప్రొఫెషనల్ ట్రెయినింగ్ ఇస్తారు.

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో.. 
-7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరాన్ని పూర్తిచేయాలి.
-20 ఉతక్ బైటక్‌లు చేయాలి.
-10 ఫుష్ అప్‌లు
-పై అన్ని పరీక్షల్లో క్వాలిఫై అయినవారికి వైద్యపరీక్షలు నిర్వహించి జూలైలో ఫలితాలను వెల్లడిస్తారు.
-జీతభత్యాలు: 7వ వేతన సంఘం సిఫారసు అనుసరించి నెలకు జీతం రూ. 21,700/- వీటికి తోడు డీఏ, కిట్ మెయింటేనెన్స్ అలవెన్స్, ఇతర అలవెన్స్‌లు ఉంటాయి. 
-పదోన్నతులు: నావిక్ నుంచి ప్రధాన్ అధికారి హోదా వరకు వెళ్లవచ్చు. ప్రధాన్ అధికారి పేస్కేల్ 7వ వేతన సంఘం సిఫారసు అనుసరించి రూ.47,600/- జీతం ఉంటుంది.
-పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా వివిధ జోన్లలోని మొత్తం 19 ఎగ్జామినేషన్ సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.
-తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభ్యర్థులు ఈస్ట్‌జోన్ పరిధిలోకి వస్తారు.
-ఈస్ట్‌జోన్ పరిధిలోని పరీక్ష కేంద్రాలు- సికింద్రాబాద్, చెన్నై, విశాఖపట్నంలో ఉన్నాయి 
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. పూర్తి వివరాలతోపాటు వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, పర్సనల్ మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. నిర్ణీత నమూనాలో అభ్యర్థి ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
-దరఖాస్తులకు చివరితేదీ : 2018 జనవరి 2 సాయంత్రం 5 గంటల వరకు)
-వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in 

-ఇంటర్ చదివిన అభ్యర్థులకు అవకాశం
-డిఫెన్స్ సర్వీసెస్‌లో ఉద్యోగం
-10+2 ఎంట్రీ స్కీమ్ ద్వారా ఎంపిక
-రాతపరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక