notifications

సెంట్రల్ బ్యాంక్‌లో సెక్యూరిటీ ఆఫీసర్స్

Webdesk | Tuesday, December 26, 2017 6:57 PM IST

 నేషనల్ కమర్షియల్డ్ బ్యాంకైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ)లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ (మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రూప్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1911లో స్థాపించారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 17 (జనరల్-8, ఓబీసీ-5, ఎస్సీ-3, ఎస్టీ-1) 
-పోస్టు పేరు: సెక్యూరిటీ ఆఫీసర్స్
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, పారామిలిటరీ ఫోర్సెస్‌లో ఐదేండ్లపాటు పనిచేసి ఉండాలి. 
-పే స్కేల్ : రూ.31,705-1145/1-32850-1310/10-45,950/-
-వయసు: 2017 అక్టోబర్ 31 నాటికి 45 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీలకు రూ. 550/-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 50/- చెల్లించాలి. 
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ + పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. 
-ఆన్‌లైన్ టెస్ట్ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.ఈ పరీక్షలో స్పెషల్/కేటగిరీ నాలెడ్జ్(సెక్యూరిటీ), కంప్యూటర్ నాలెడ్జ్, బ్యాంకింగ్, ఆర్థిక అంశాలు, జనరల్ అవేర్‌నెస్ అంశాలపై ప్రశ్నలను ఇస్తారు. 
-దరఖాస్తు : ఆన్‌లైన్ 
-చివరితేదీ : 2018, జనవరి 1
-కాల్‌లెటర్స్ డౌన్ లోడింగ్ : 2018, జనవరి 16
-ఆన్‌లైన్ పరీక్ష : 2018, జనవరి 28
-వెబ్‌సైట్: www:centralbankofindia.co.in