notifications

ఎయిర్‌లైన్ సర్వీసెస్‌లో పోస్టుల భర్తీ

Webdesk | Sunday, December 17, 2017 11:06 PM IST

ఎయిర్‌లైన్ సర్వీసెస్‌లో పోస్టుల భర్తీ

 ఎయిర్‌లైన్ ఐల్లెడ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఏఎస్‌ఎల్) దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:ఎయిర్‌లైన్ ఐల్లెడ్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఎయిర్ ఇండియా పరిధిలో పని చేస్తున్న అనుబంధ సంస్థ. 
 
-డిప్యూటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్-1
-చీఫ్ ఆఫ్ పర్సనల్-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఐసీఏఐ నుంచి సీఏలో ఉత్తీర్ణత
-సింథటిక్ ైఫ్లెట్ ఇన్‌స్టక్టర్-2
-మేనేజర్ సేల్స్ అండ్ మార్కెటింగ్-1
-మేనేజర్ ఎంఎండీ-1
-మేనేజర్ కార్పొరేట్ కమ్యూనికేషన్-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ/పీజీ డిప్లొమా (మాస్ కమ్యూనికేషన్)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: రూ. 42,000/-, చీఫ్ ఆఫీసర్‌కు రూ. 80,000/-
-స్టేషన్ మేనేజర్ -12
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఏవియేషన్ రంగంలో ఎయిర్‌పొర్ట్ హ్యాండిల్లింగ్/సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 40 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 42,000/- సంస్థ నిబంధనల ప్రకారం అదనంగా ఇతర ప్రోత్సాహకాలను కూడా ఇస్తారు.
-టెక్నికల్ అసిస్టెంట్స్-14
-అర్హత: ఏఎంఈ లేదా డీజీసీఏ నుంచి ఏఎంఈ ట్రెయినింగ్ కోర్సు కాంప్లెషన్ సర్టిఫికెట్‌లోఉత్తీర్ణత. ఏవియేషన్ రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లకు మించరాదు
-పే స్కేల్: రూ. 18,000/-
-పని చేసే ప్రదేశాలు: హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, భోపాల్ 
-అప్లికేషన్ ఫీజు: రూ. 1500/-
-ఎంపిక: ఇంటర్వ్యూ, టెక్నికల్ టెస్ట్
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి. 
చిరునామా: Alliance Air Personnel Department, Alliance Bhavan, Adjacent to the Office of ED (NR), Air India Limited,Terminal -1B, IGI Airport, New Delhi - 110037
-దరఖాస్తు చివరితేదీ: 2018 జనవరి 3
-వెబ్‌సైట్: http://www.airindia.in