notifications

ఎయిర్‌ ఇండియాలో టెక్నీషియన్లు

Webdesk | Wednesday, December 20, 2017 1:56 AM IST

ఎయిర్‌ ఇండియాలో టెక్నీషియన్లు

 ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్) ఖాళీగా ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్, ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: ఏఐఈఎస్‌ఎల్ అనేది ఎయిర్ ఇండియా లిమిటెడ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే సంస్థ. వెస్టర్న్ రీజియన్ పరిధిలోని ఈ పోస్టులను ఐదేండ్ల కాలపరిమితికి భర్తీచేయనున్నారు. అభ్యర్థి ప్రవర్తనను బట్టి మరో ఐదేండ్లవరకు పొడిగిస్తారు. 

-మొత్తం ఖాళీల సంఖ్య- 325 పోస్టులు 
-పోస్టు పేరు: ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్
-బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్-210 పోస్టులు (జనరల్-108, ఓబీసీ-56, ఎస్సీ-31, ఎస్టీ-15)
-ఎయిర్‌బస్ ఎయిర్ క్రాఫ్ట్స్-172 పోస్టులు (జనరల్-115, ఓబీసీ-31, ఎస్సీ-17, ఎస్టీ-9)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/ సంస్థ లేదా డీజీసీఏ నుంచి 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 60 శాతం) మార్కులతో ఏఎంఈ డిప్లొమా/సర్టిఫికెట్ (ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత. ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులయితే డీజీసీఏ నుంచి నాలుగేండ్ల డిప్లొమా ఇంజినీరింగ్ (ఎయిర్‌ఫ్రెమ్/ఇంజిన్/ ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, రేడియో ట్రేడ్స్) లేదా మూడేండ్ల డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, రేడియో ఇంజినీరింగ్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-పోస్టు పేరు: స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్ బోయింగ్
-మొత్తం ఖాళీల సంఖ్య- 35 పోస్టులు 
-ఫిట్టర్-25 పోస్టులు (జనరల్-15, ఓబీసీ-6, ఎస్సీ-3, ఎస్టీ-1)
-కార్పెంటరీ-5 పోస్టులు (జనరల్-4, ఓబీసీ-1)
-సీయింగ్ (కుట్టు) -5 పోస్టులు (జనరల్-4, ఓబీసీ-1) 
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఎన్‌సీవీటీ నుంచి ఫిట్టర్/కార్పెంటర్, సీవింగ్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 2017 నవంబర్ 1 నాటికి 35 ఏండ్లకు మించరాదు. సంస్థ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 20,000/- (కన్సాలిడేటెడ్ పే ), అదనంగా ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.
-అప్లికేషన్ ఫీజు : రూ.1000/- (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు) 
-ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
-ట్రేడ్ టెస్ట్: బోయింగ్ విభాగంలో టెక్నీషియన్స్‌కు 2018 జనవరి 8 నుంచి 12 వరకు, ఎయిర్‌బస్ విభాగంలో టెక్నీషియన్స్‌కు 2018 జనవరి 15 నుంచి 19వ రకు, ట్రేడ్స్‌మెన్‌కు 2018 ఫిబ్రవరి 5, 6వ తేదీల్లో ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. అర్హత కలిగిన అభ్యర్థులందరూ నిర్ణీత నమూనాలో దరఖాస్తును నింపి, అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటో జతచేసి బోయింగ్ /ఎయిర్‌బస్ ఎయిర్ క్రాఫ్ట్స్, స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్ బోయింగ్ పర్సనల్ అధికారికి పంపాలి లేదా ఈ మెయిల్ ([email protected] లేదా [email protected]) ద్వారా పంపించవచ్చు.
చిరునామా: Air India engineering Services Limited, Old Airport, APU Hangar, Next To Flight Safety Dept, Kalina, Old Airport, Santa Cruz (East), Mubai-400029
-దరఖాస్తులకు చివరితేదీ: 2018 జనవరి 2, 3
-వెబ్‌సైట్: www.airindia.in