notifications

ఎయిర్ ఇండియాలో సెక్యూరిటీ ఏజెంట్లు

Webdesk | Wednesday, July 25, 2018 9:28 PM IST

  ఎయిర్ ఇండియా పరిధిలోని ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏటీఎస్‌ఎల్) బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ ఏజెంట్స్ ( కాంట్రాక్ట్ ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.


-మొత్తం పోస్టుల సంఖ్య: 159 (చెన్నె-96, బెంగళూరు-63)
-పోస్టు పేరు: సెక్యూరిటీ ఏజెంట్స్ (మూడేండ్లు వ్యవధి కోసం) 
-అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీతోపాటు వ్యాలిడ్ బేసిక్ ఏవీఎస్‌ఈసీ లేదా బేసిక్ (ఏవీఎస్‌ఈసీ లేకుండా) సర్టిఫికెట్ ఉండాలి. హిందీ/ఇంగ్లిష్, లోకల్ లాంగ్వేజ్‌లో పరిజ్ఞానం, కంప్యూటర్ ఆపరేషన్స్‌పై బేసిక్ నాలెడ్జ్‌ను కలిగి ఉండాలి. ఎన్‌సీసీ బీ/సీ, ఫైర్ ఫైటింగ్/ఇండస్ట్రియల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్/కంప్యూటర్ కోర్సులో సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
-ఎత్తు: కనీసం 170 సెం.మీ. (పురుషులు) , 157 సెం.మీ. (మహిళలు) ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. 
-వయస్సు : 28 ఏండ్లకు మించరాదు. 
-పే స్కేల్: రూ. 19,590/- 
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
-ఎంపిక విధానం: విద్యార్హత+పీఏటీ, రాత పరీక్ష, ఇంటర్వ్యూ.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో.
-ఇంటర్వ్యూ/ రాత పరీక్ష: ఆగస్టు 3,4,7 (చెన్నైలో), ఆగస్టు 10,11 (బెంగళూరులో)
-వెబ్‌సైట్: http://www.airindia.in