notifications

అగ్రి క్లినిక్‌ల స్థాపన కోసం ఉచిత శిక్షణ

webdesk | Wednesday, September 13, 2017 11:42 AM IST

 హైదరాబాద్ : వ్యవసాయ వ్యాపార కేంద్రాలు-అగ్రి క్లినిక్‌లను సాపన కోసం ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నట్టు సెంటర్ ఫర్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ (సీఈడీ) ఓ ప్రకటనలో తెలిపింది. ప్రగతినగర్ పరిధిలో ఎలీఫ్ పారి శ్రామిక వాడలోని సంస్థ కార్యాలయంలో రెండు నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజ నం కల్పించనున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. డిప్లమా అగ్రి (డీఐపీ, బీఎస్సీ, ఎంఎస్సీ, బయో టెక్, పీహెచ్‌డీ, బీజెడ్‌సీ, అగ్రికల్చర్ సైన్స్) మరియు 2016వ సంవత్సరం నాటికి వారి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఉండాలి. 

60 శాతం వ్యవపాయానికి సంబంధించి కోర్సు కంటెంట్ ఉండాలి. ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన వారిచే ట్రైనింగ్ ఇప్పించబడునని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఈనెల 14.09.2017 ప్రారంభమవుతుంది. దీనికి దర ఖాస్తు నమోదు కోసం మరియు ఇతర వివరాలకు 7036666422, 9676798079 నంబర్‌లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులకు గురువారం చివరి తేదీ అని పేర్కొన్నారు.