higher-education

ఎంబీబీఎస్, బీడీఎస్‌ మిగిలిన సీట్లుకు కౌన్సెలింగ్

webdesk | Saturday, August 12, 2017 11:50 AM IST

 హైదరాబాద్ : మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి రెండోవిడుత కౌన్సెలింగ్ జరుగనున్నది. తొలివిడుత కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 2017-18 విద్యా సంవత్సరానికి కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్‌కు రూపొందించిన మెరిట్ జాబితా ఏ క్యాటగిరీ (కన్వీనర్ కోటా) ఎంపికచేసిన విద్యార్థులు చేరకపోవడంతో మిగిలిన సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 11 నుంచి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ వీసీ కరుణాకర్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్సిటీ గుర్తింపుపొందిన మెడికల్, డెంటల్ కళాశాల్లో ప్రవేశానికి ఏ క్యాటగిరీలో మిగిలినవాటిని రెండోవిడుత వెబ్‌ఆప్షన్ నిర్వహించి, కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.