higher-education

జిప్‌మర్‌లో ఎంబీబీఎస్ ప్రవేశాలు

Webdesk | Tuesday, March 13, 2018 12:48 PM IST

 పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్) 2018-19 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సు ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

 

వివరాలు:దేశంలోని ప్రతిష్ఠాత్మక వైద్య విజ్ఞాన సంస్థల్లో జిప్‌మర్ ఒకటి. ఈ ఇన్‌స్టిట్యూట్‌ను 1956లో స్థాపించారు. జిప్‌మర్‌కు పుదుచ్చేరితోపాటు, కరైకల్‌లో క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ రెండు క్యాంపస్‌ల్లో కలిపి మొత్తం 200 సీట్లు ఉన్నాయి.
-కోర్సు పేరు: ఎంబీబీఎస్
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఇంటర్ (ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) లేదా 10+2లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2018 లో ఇంటర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

-వయస్సు: 2018 డిసెంబర్ 31 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 3000/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 1200/-, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)

-దేశవ్యాప్తంగా 120 కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ విధానం (సీబీటీ)లో రాతపరీక్ష నిర్వహిస్తారు.
-జూన్ 3న రెండు విడతలుగా (ఉదయం, మధ్యాహ్నం) 150 నిమిషాల్లో రాతపరీక్షను నిర్వహిస్తారు.
-ఆబ్జెక్టివ్ విధానంలో ఐదు విభాగాల నుంచి 200 ప్రశ్నలను ఇస్తారు. 
-పరీక్ష పేపర్ ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. సంస్థ నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి.
-ప్రతి ప్రశ్నకు 4 మార్కులు, తప్పు సమాధానానికి 1 మార్కును తగ్గిస్తారు.
-ఈ ఆబ్జెక్టివ్ రాతపరీక్ష ఇంటర్ స్థాయిలో ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 13
-హాల్‌టిక్కెట్ డౌన్ లోడింగ్: మే 21 నుంచి
-జిప్‌మర్ ఎంబీబీఎస్ పరీక్షతేదీ: జూన్ 3
-కౌన్సెలింగ్ తేదీలు: జూన్ 27 నుంచి 29 వరకు
-వెబ్‌సైట్: www.jipmer.edu.in