higher-education

హైదరాబాద్‌లో ఓషియానోగ్రఫీ శిక్షణకేంద్రం

Webdesk | Saturday, December 16, 2017 11:04 AM IST

హైదరాబాద్‌లో ఓషియానోగ్రఫీ శిక్షణకేంద్రం

  హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఆపరేషనల్ ఓషియనోగ్రఫీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కేంద్రం ఏర్పాటుకు యునెస్కోతో చేసుకున్న ఒప్పందానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హిందూ, అట్లాంటిక్ మహాసముద్ర తీరాల సరిహద్దు దేశాలు, చిన్న ద్వీప దేశాల పరిధిలో సాగరాల్లో పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులపై ఈ కేంద్రం అధ్యయనం చేస్తుంది. విపత్తులు, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇస్తారు. 


యునెస్కో సహకారంతో చేపట్టే ఈ శిక్షణ కేంద్రభవన నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుంది. దీంతో హిందూ మహాసముద్రంలో పరిస్థితుల అధ్యయనంలో మనదేశం నాయకత్వ స్థానంలో నిలుస్తుంది. స్థానిక విద్యార్థులతోపాటు ఆయా సభ్యదేశాల వారి నైపుణ్యం పెరుగుతుంది. వారికి విదేశాల్లోనూ ఉద్యోగాలు పొందే అవకాశం లభిస్తుంది. దీంతో భారత్‌కు హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు, దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల మధ్య సహకారం పెరుగుతుంది. హైదరాబాద్‌లోని బాలానగర్‌లో 2007లో సునామీ హెచ్చరికల కేంద్రం కూడా ఏర్పాటైన సంగతి తెలిసిందే.