higher-education

బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు

Webdesk | Saturday, June 10, 2017 11:00 AM IST

కాచిగూడ: ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు సంవత్సరం నష్టపోకుండా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు గల బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు యువతీ, యువకుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ డైరెక్టర్ లక్కాకుల విశాలాక్షి తెలిపారు. బర్కత్‌పుర కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ 3 సంవత్సరాల బీఎస్సీ డిగ్రీ ఫ్యాషన్ టెక్నాలజీ, రెండు సంవత్సరాల ఇంటర్ ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, సం వత్సరం పాటు డిప్లొమా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు లతో పాటు ఫ్యాషన్ ఇలిస్ట్రేషన్(స్కేచ్చింగ్), సర్‌ఫెస్ ఆర్న మెంటేషన్ (ఎంబ్రాయిడరీ అండ్ పెయింటింగ్), టెక్స్ టైల్స్ సైన్స్ (డైనింగ్ అండ్ ఫెయింటింగ్), ఫ్యాట్రన్ మేకింగ్(ఫ్యాబ్రిక్ కటింగ్), గార్మెంట్ కన్‌స్ట్రక్షన్ (టైల రింగ్)లలో శిక్షణ ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 9030610044/55లో సంప్రదించవచ్చన్నారు.